vevela varnala kanthulu virajimme rangu rangula gajupenkula gutta kanna oka manchi mutyame makkuva kada.A manchi mutyam koraku anveshane kada ee jeevitam.
Mana jeevitam lo entho mandi talukku mantaru, kontha mandi dhaga dhaga merustaru varandaru aa ralla gutta lo okare, mana mutyam dorikentha varaku ila entho mandi merustaru. akarshistaru. akakttukuntaru. Kani andaru alochimpajelayeru. Manasuki anandanni andivvaleru. Ala kondare untaru. vallu edo oka roju kalustaru. Appativaraku manaki aa mutyaniki gaju mukka ki unna vyatyasam ardham kadu. Ardham ayyela evaru cheppaleru kuda.
Ee mutyam ninnu kalavaka mundu enno theeralu enthento dooralu prayanam chesi vachindi. Chinni isuka renuvuni mingi inka aa mutyam thanake sontham anukuntunna
aa alchippa pranalane harinchindi. Oka jalari chetiki chikkindi. Jalariki deeni viluva poorthi ga teleedu. telisina emi cheskoleni paristhithi. samudram nunchi veliki teesi kamsali chetilo pettadam thone athani badhyata teeripoyindi. athani anubandham antham aipoyindi. Idi enno mutyalanu veliki teesina thanakantu okkadanni kuda sontham cheskoleni deena gadha ee jalaridi.
Atu nunchi aa mutyam payanam kamsali daggariki. Eeyana ooha sakthi amogham. raayi laga kanipinche dani nunchi atyadbhutamaina mutyanni chekkina ghanata ithanike swantham. atuvanti ithaniki kuda sandigdham. thana daggare unchukunte aakali badha. ammi vesthe kadupu kotha.Reyimbavallu kashtapadi chekkadu mari.
Mutyaniki kuda konchem badha undi. sannani uli debbalu sudulla guchukuntunte orchukundi. kani avvanni thana kosame ani telisi santoshapadindi. thana andanni chusi thane murisipoyindi.kamsaliki hrudaya purvaka kruthgnyathalu cheppukundi. Athaniki elagaina nyayam cheyyali anukundi. Athaniki sampatti ni penchali ani
nirnayinchukundi. andukosam kontha atmakshobanu aina bharinchadaniki siddha padindi.
Ade samayamlo aa kamsali daggariki vellavu. Mutyam andamga mustabayyindi.churakattulanti aa choopula banalu nee kantiki guchukunnayi. Atu vaipu tirigavu. chusavu. anandinchavu. abhimaninchavu. preminchanu. teesukunnavu. gundello padilam ga dachukunnavu.nee abhimanam lo apadamastakam munigina aa mutyam kuda ninnu abhimaninchindi. Ninnu marintha andam ga chupinchalani nirnayinchukundi. Adi thana pane aina, nee kosam inka anandam tho rettinchina utsaham tho chesindi.
kani aa roju, aa bandhipotla mutha ninnu looti chesindi. nee sarvasvanni dochukellindi. nee mutyam tho saha. vaddu vaddu ani bathimalavu.vekki vekki edchavu.
naa pranalu teesukellina bagundedi ani anukunnavu. enno rojulu nidraharalu lekunda gadipavu. aa gajupenkulathone sangathyam bagundunu kada. evaru vatini etukuporu anukunnav. sneham chesavu. cheyyi kosukunnavu. nijam telusukunnavu.
Muthyalu konne unnayi kani okkate ledu. Maro muthyam kosam sodhinchavu. opika tho nireekshinchavu. chivariki sadhinchavu. ee sari inkonchem jagratta paddavu. Jeevithantam neetho undela maluchukunnavu. Ala ani poyinadanini marachipolevu. em chesina marachipolevu. enno sarlu gurthuku vasthundi. enno vidhaluga muripisthundi.thanu ledanna chedu nijanni gurthuchesi vellipothundi. oka chinni chirunavvu chindinchi nee pani lo nuvvu munigipothavu.
Idi nee jeevithantam gurthu pettukuntavu. chedu anubhavam laga matram kadu. tiyyanaina gnayapakam laga. madhuramaina anubhuti laga. swachamaina prema laga.
Subscribe to:
Post Comments (Atom)
adbhutam ga rasavu... hats off.
ReplyDeleteNinnu kuda jeevithantham gurthupettukuntam... Devuni bidda laaga _/\_ emanna rasava asalu
ReplyDeleteIn Telugu.
ReplyDeleteవేవేల వర్ణాల కాంతులు విరజిమ్మే రంగు రంగుల గాజుపెంకుల గుట్ట కన్నా ఒక మంచి ముత్యమే మక్కువ కదా. ఆ మంచి ముత్యం కొరకు అన్వేష నే కదా ఈ జీవితం.
మన జీవితం లో ఎంతో మంది తలుక్కు మంటారు, కొంత మంది ధగ ధగ మెరుస్తారు వారందరూ ఆ రాళ్ల గుట్ట లో ఒకరే, మన ముత్యం దొరికేంత వరకు ఇలా ఎంతో మంది మెరుస్తారు. ఆకర్షిస్తారు. ఆకక్ట్టుకుంటారు. కానీ అందరు అలోచిమ్పజేయలేరు. మనసుకి ఆనందాన్ని అందివ్వలేరు. అల కొందరే ఉంటారు. వాళ్ళు ఏదో ఒక రోజు కలుస్తారు. అప్పటివరకు మనకి ఆ ముత్యానికి గాజు ముక్క కి ఉన్న వ్యత్యాసం అర్ధం కాదు. అర్ధం అయ్యేలా ఎవరు చెప్పలేరు కూడా.
ఈ ముత్యం నిన్ను కలవక ముందు ఎన్నో తీరాలు ఎంతెంతో దూరాలు ప్రయాణం చేసి వచ్చింది. చిన్ని ఇసుక రేనువుని మింగి ఇంకా ఆ ముత్యం తనకే సొంతం అనుకుంటున్నా ఆ ఆల్చిప్ప ప్రాణాలనే హరించింది. ఒక జాలరి చేతికి చిక్కింది. జాలరికి దీని విలువ పూర్తి గ తెలీదు. తెలిసిన ఏమి చేస్కోలేని పరిస్థితి. సముద్రం నుంచి వెలికి తీసి కంసాలి చేతిలో పెట్టడం తోనే అతని బాధ్యత తీరిపోయింది. అతని అనుబంధం అంతం ఐపోయింది. ఇది ఎన్నో ముత్యాలను వెలికి తీసిన తనకంటూ ఒక్కదాన్ని కూడా సొంతం చేస్కోలేని దీన గాధ ఈ జాలరిది.
అటు నుంచి ఆ ముత్యం పయనం కంసాలి దగ్గరికి. ఈయన ఊహ శక్తీ అమోఘం. రాయి లాగా కనిపించే దాని నుంచి అత్యద్భుతమైన ముత్యాన్ని చెక్కిన ఘనత ఇతనికే స్వంతం. అటువంటి ఇతనికి కూడా సందిగ్ధం. తన దగ్గరే ఉంచుకుంటే ఆకలి బాధ. అమ్మి వేస్తే కడుపు కోత. రేయింబవళ్ళు కష్టపడి చెక్కాడు మరి.
ముత్యానికి కూడా కొంచెం బాధ ఉంది. సన్నని ఉలి దెబ్బలు సూదుల్ల గుచుకుంటుంటే ఓర్చుకుంది. కానీ అవ్వన్నీ తన కోసమే అని తెలిసి సంతోషపడింది. తన అందాన్ని చూసి తనే మురిసిపోయింది. కంసాలికి హృదయ పూర్వక కృతజ్ఞ్యతలు చెప్పుకుంది. అతనికి ఎలాగైనా న్యాయం చెయ్యాలి అనుకుంది. అతనికి సంపత్తి ని పెంచాలి అని నిర్ణయించుకుంది. అందుకోసం కొంత అత్మక్షోబను ఐన భరించడానికి సిద్ధ పడింది.
అదే సమయంలో ఆ కంసాలి దగ్గరికి వెళ్ళవు. ముత్యం అందంగా ముస్తాబయ్యింది.చురకట్టులాంటి ఆ చూపుల బాణాలు నీ కంటికి గుచుకున్నాయి. అటు వైపు తిరిగావు. చూసావు. ఆనందించావు. అభిమానిన్చావు. ప్రేమించాను . తీసుకున్నావు. గుండెల్లో పదిలం గ దాచుకున్నావు.నీ అభిమానం లో ఆపాదమస్తకం మునిగిన ఆ ముత్యం కూడా నిన్ను అభిమానించింది. నిన్ను మరింత అందం గ చూపించాలని నిర్ణయించుకుంది. అది తన పనే ఐన, నీ కోసం ఇంకా ఆనందం తో రెట్టించిన ఉత్సాహం తో చేసింది.
కానీ ఆ రోజు, ఆ బందిపోట్ల ముఠా నిన్ను లూటి చేసింది. నీ సర్వస్వాన్ని దోచుకేల్లింది. నీ ముత్యం తో సహా. వద్దు వద్దు అని బతిమలవు. వెక్కి వెక్కి ఎడ్చావు.
నా ప్రాణాలు తీసుకెళ్ళిన బాగుండేది అని అనుకున్నావు. ఎన్నో రోజులు నిద్రాహారాలు లేకుండా గడిపావు. ఆ గాజుపెంకులతోనే సాంగత్యం బాగుండును కదా. ఎవరు వాటిని ఎటుకుపోరు అనుకున్నావ్. స్నేహం చేసావు. చెయ్యి కోసుకున్నావు. నిజం తెలుసుకున్నావు.
ముత్యాలు కొన్నే ఉన్నాయి కానీ ఒక్కటే లేదు. మరో ముత్యం కోసం సోదిన్చావు. ఓపిక తో నిరీక్షిన్చావు. చివరికి సాధించావు. ఈ సరి ఇంకొంచెం జాగ్రత్త పడ్డావు. జీవితాంతం నీతో ఉండేలా మలుచుకున్నావు. అల అని పోయినదనిని మరచిపోలేవు. ఎం చేసిన మరచిపోలేవు. ఎన్నో సార్లు గుర్తుకు వస్తుంది. ఎన్నో విధాలుగా మురిపిస్తుంది. తను లేదన్నచెడు నిజాన్ని గుర్తుచేసి వెళ్ళిపోతుంది. ఒక చిన్ని చిరునవ్వు చిందించి నీ పని లో నువ్వు మునిగిపోతావు.
ఇది నీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటావు. చెడు అనుభవం లాగా మాత్రం కాదు. తియ్యనైన గ్నయపకం లాగా. మధురమైన అనుభూతి లాగా. స్వచమైన ప్రేమ లాగా.
telugu lipi lo prayatninchu inka tiyyaga untundhi...nizzam chal babga rasav...akariga bev ki krutagnathalu
ReplyDelete